పూజా హెగ్డే అదృష్టం మామూలుగా లేదుగా

Published on Feb 11, 2020 9:58 am IST

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోని పూజా హెగ్డే హవా నడుస్తోంది. ఇటీవలే ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆమె ప్రజెంట్ ప్రభాస్ చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇంకొంతమంది స్టార్ హీరోల చిత్రాల్లో కూడా ఆమె పేరు వినిపిస్తోంది. ఇలా తెలుగునాట దూసుకుపోతున్న ఆమెకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. తొలుత బాలీవుడ్లో ఆమె చేసిన ‘మొహెంజొదారో’ ఫ్లాప్ అయినా ఇటీవల చేసిన ‘హౌస్ ఫుల్ 4’ ఆమెకు కొంత ఊరటనిచ్చింది.

ఈ విజయంతో ఆమెకు ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. సాజిద్ నడియడ్వాల నిర్మిస్తున్న ‘కబి ఈద్ కబి దివాళి’ చిత్రంలో పూజాను కథానాయికగా ఎంపిక చేశారు. సల్మాన్ సరసన నటించడం పూజాకు ఇదే మొదటిసారి. ఈ అవకాశం పూజాకు నిజంగా గోల్డెన్ ఛాన్స్ అనే అనాలి. 2021 ఈద్ కానుకగా విడుదలకానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్మాల్ టౌన్ యువతిగా కనిపిస్తుందట. ఫర్హాద సంజీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులు ఉండనున్నాయి.

సంబంధిత సమాచారం :