“రాధే శ్యామ్” పై అంచనాలు పెంచే విధంగా పూజా కొత్త పోస్టర్!

Published on Oct 13, 2021 10:37 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఈరోజు ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే కానుకగా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది అని తెలిసింది. మరి ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం నుంచి ఇప్పుడు పూజా హెగ్డే బర్త్ డే కానుకగా అద్భుతమైన పోస్టర్ ని రిలీజ్ చేశారు.

మొత్తం తెలుపు రంగు డ్రెస్సింగ్ తో ఇంతకు ముందు వచ్చిన పోస్టర్స్ కంటే కూడా పూజా ఇందులో చాలా అందంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ పోస్టర్ ని చూస్తే సాంగ్ లోనిదా లేక సన్నివేశామా అనేది ఏమో కానీ విజువల్ మాత్రం చాలా గ్రాండియర్ గా వింటేజ్ ఫీల్ ని తీసుకొస్తుంది.

దీనితో మేకర్స్ మొదటి నుంచి కూడా చెప్తున్నా విధంగా సినిమా మాత్రం ఒక అద్భుతమైన పెయింటింగ్ లా ఉంటుందని చెప్తున్న మాట నిజమే అని అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సినిమాలో విజువల్స్ ఏ లెవెల్లో ఉంటాయో ఎంతలా మ్యాజిక్ చేస్తాయో చూడాలి. అలాగే ఇందులో చిత్రం రిలీజ్ డేట్ లో కూడా ఎలాంటి మార్పు లేదని కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :