విజయోత్సాహంలో పూజా హెగ్డే

Published on Jan 17, 2020 12:00 am IST

పూజా హెగ్డే 2020కి మంచి కిక్ స్టార్ట్ అందుకుంది. ఈ సంవత్సరంలో ఆమె నుండి వచ్చిన మొదటి చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గర్లో ఉన్న ఈ చిత్రం ఓవర్సీస్లో సైతం భారీ కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ విజయంతో ఇప్పటికే స్టార్ హీరోయిన్ల జాబితాలో ఉన్న పూజా రేంజ్ మరింత పెరిగిపోయింది.

ప్రేక్షకుల్లో.. మరీ ముఖ్యంగా యువతలో పూజా క్రేజ్ రెట్టింపైందనే అనాలి. ఈ విజయంతో ఇకపై ఆమె పనిచేసే సినిమాలకు ఆమె కూడా క్రౌడ్ పుల్లర్ గా మారుతుందనడంలో సందేహమే లేదు. ఈ విజయాన్ని పూజా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ విజయం ఆమెకు మరిన్ని పెద్ద సినిమా ఆఫర్లను అందించడం ఖాయం. ఇకపోతే ప్రస్తుతం ఆమె ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘జాన్’ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :