భవదీయుడు’లో తన రోల్ కోసం ఎగ్జైట్ అవుతున్న పూజా హెగ్డే!

Published on Oct 14, 2021 3:56 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో వీరి కాంబో బ్లాక్ బస్టర్ కాంబోగా ఫిక్స్ అయ్యిపోయింది. ఇక ఆ తర్వాత అనౌన్స్ అయ్యిన రెండో సినిమానే “భవదీయుడు భగత్ సింగ్” అంతే కాకుండా జస్ట్ కొన్ని రోజులు కితమే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అయ్యినట్టుగా దర్శకుడే చెప్పేసాడు. ఇక నిన్న పూజా హెగ్డే బర్త్ డే కావడంతో సినీ ప్రముఖులు అంతా కూడా ఆమెకి విషెష్ తెలుపగా వారిలో హరీష్ శంకర్ కూడా ఒకరు.

మరి తన సినిమాలు డీజే, గద్దలకొండ గణేష్ సినిమా వర్కింగ్ స్టిల్స్ పెట్టి పూజా ఏ రోల్ కి అయినా సరిపోతుంది అని విషెష్ చెప్పగా పూజా ఇప్పుడు రిప్లై ఇస్తూ ఈ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎలాంటి ప్లాన్ చేసారా అని భవదీయుడు సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతుంది. పవన్ మరియు పూజా కాంబోలో సినిమా చూడాలని ఎప్పుడు నుంచో చాలా మంది అందుకుంటున్నారు. మరి ఈ సినిమాలో హరీష్ వారిని ఎలా చూపిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :