ఆ హీరోయిన్ కి అంత ఇస్తున్నారా ?

ఆ హీరోయిన్ కి అంత ఇస్తున్నారా ?

Published on Feb 27, 2019 2:05 AM IST

పెద్దగా హిట్లు లేని హీరోయిన్ భారీగా రెమ్యూనిరేషన్ ను అందుకొని, ఆఫర్స్ ను కూడా భారీగానే బాగానే అందుకుంటుంది. ఇంతకీ అసలు మ్యాటర్ లో వెళ్తే.. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ చిత్రం పర్వాలేదనిపించింది కానీ పూజ కెరీర్ కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు.

ఆ తరువాత ‘ముకుంద’లో నటించినా అది పరాజయం అయింది. అయితే ఏం… వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రానికి గానూ పూజ కోటి 75 లక్షల పారితోషికం తీసుకుందట. అలాగే కొత్తగా ఒప్పుకుంటున్న సినిమాలకి కూడా నిర్మాతలు అంతే ఇస్తున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు