ఆ హీరో సినిమాకు పూజా హెగ్డే పారితోషకం తగ్గించుకుందట !

Published on Dec 3, 2020 10:00 pm IST

మలయాళ స్టార్ నటుడు డుల్కర్ సల్మాన్ ఎట్టకేలకు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘మహానటి’ చిత్రంలో ఆయన నటన చూసిన తెలుగు ఆడియన్స్ ఆయన సోలో హీరోగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పారాయన. ఈ చిత్రంలో కథానాయకిగా స్టార్ నటి పూజా హెగ్డేను తీసుకున్నారు. పూజా హెగ్డే వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉంది.

‘అరవింద సమేత, గద్దలకొండ గణేష్, మహర్షి, అల వైకుంఠపురములో’ లాంటి భారీ విజయాలతో పూజా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రజెంట్ ఆమె ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తోంది. అందుకే ఆమె రెమ్యునరేషన్ కూడ భారీగా పెరిగింది. సినిమాకు దగ్గరదగ్గర రెండున్నర కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడిల సినిమా కోసం మాత్రం పారితోషకాన్ని కొద్దిగా తగ్గించుకుంది ఈ ముద్దుగుమ్మ. చిత్ర నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ జరిపిన చర్చల ఫలితంగా పూజా పారితోషకాన్ని తగ్గించుకుందని ఫిల్మ్ నగర్ టాక్.

సంబంధిత సమాచారం :

More