పూజా హెగ్డే పెద్ద మనసు

Published on Jun 2, 2021 1:09 am IST

కరోనా కష్ట కాలంలో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ మూలంగా పనులు లేక రోజువారీ అవసరాలు కూడ తీరక కూలీలు కష్టాలు పడుతున్నారు. దీంతో సహాయం చేసేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమవంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడ ముందుకు వచ్చి చేయూతనిస్తోంది. 100 మంది పేదలకు నెలకు సరిపడా రోజువారీ సరుకులు అందించి సహాయం చేసింది.

ఇలాంటి ఆపత్కర సమయంలో పూజా హెగ్డే చేసిన సహాయానికి నెటిజన్లు అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పూజా హెగ్డే కూడ గతంలో కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది. వాటిలో ఒకటి ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాధే శ్యామ్’ కాగా రెండవది సల్మాన్ ఖాన్ చిత్రం, మూడవది రోహిత్ శెట్టి చిత్రం. ఇవి కాకుండా తమిళంలో విజయ్ చేయనున్న కొత్త సినిమాలో కూడ పూజా హెగ్డేనే కథానాయికగా చేయనుంది.

సంబంధిత సమాచారం :