బుట్ట బొమ్మకు కరోనా పాజిటివ్ !

Published on Apr 25, 2021 9:01 pm IST

బుట్ట బొమ్మ పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని పూజానే స్వయంగా చెప్పింది. పూజా హెగ్డే తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అందరికీ హలో.. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయదల్చుకున్నాను. నియమ నిబంధనలు పాటిస్తు నాకు నేనుగా స్వీయ నిర్భందంలోకి వెళ్లాను. సెల్ఫ్ క్వారంటైన్ అయ్యాను అని చెప్పుకొచ్చింది పూజా. ఇక పూజాతో సన్నిహితంగా ఉన్న మిగిలిన వాళ్లు కూడా క్వారెంటెన్ లోకి వెళ్లారు. ఏది ఏమైనా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది.

కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ పెద్ద సమస్య అయిపోయింది. పైగా స్టార్స్ కు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో మేకర్స్ కి ఏం చేయాలో అర్ధం కావడంలేదు. మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సిందేనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆలియా భట్ కి, రణ్ బీర్ కపూర్ కి, నివేతా థామస్ కి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది.

సంబంధిత సమాచారం :