చరణ్ సరసన పూజా హెగ్డే.. డీగ్లామర్ లుక్ ?

Published on Jan 25, 2021 3:51 pm IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పట్ల అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సాధారణంగా మెగాస్టార్ సినిమాల మీద ఉండే క్రేజ్ కంటే భిన్నమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్ర చేస్తున్నారు. అతిథి పాత్రలో కాకుండా ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు. అయన పాత్ర పేరు ‘సిద్ద’. అందుకే అంత హైప్ ఉంది. ఇక తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో చరణ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఆమె గిరిజన యువతి పాత్రలో, కాస్త డీగ్లామరైజ్డ్ లుక్ లో కనిపిస్తుందని అంటున్నారు. గతంలో ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్, పూజా కలిసి స్టెప్పులేసినా పూర్తిస్థాయిలో కలిసి నటిస్తుండటం మాత్రం ఇదే మొదటిసారి. ఈ వార్తే గనుక నిజమైతే పూజా ఖాతాలో మరొక పెద్ద ప్రాజెక్ట్ చేరినట్టే అనుకోవాలి. ప్రస్తుతం ప్రభాస్ సరసం ఆ’రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న పూజా చేతిలో పలు పెద్ద సినిమాలున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటించింది. సినిమాను ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకులకు అందివ్వాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

సంబంధిత సమాచారం :