వాల్మీకి కి హీరోయిన్ ఫిక్స్ !

వాల్మీకి కి హీరోయిన్ ఫిక్స్ !

Published on May 3, 2019 4:10 PM IST

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘జిగర్తండా’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈచిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్ లో నటిస్తుండగా తమిళ యువ హీరో అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈచిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారు. రైజింగ్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో ఒరిజినల్ వెర్షన్ లో లక్ష్మి మీనన్ పోషించిన పాత్రలో నటించనుంది.

పూజా హెగ్డే ఈచిత్రం కోసం 15రోజులు తన డేట్స్ ను కేటాయించిందని సమాచారం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు