ఒక్క పాట మినహా విశాల్ – శృతి సినిమా షూటింగ్ పూర్తి.

ఒక్క పాట మినహా విశాల్ – శృతి సినిమా షూటింగ్ పూర్తి.

Published on Sep 4, 2014 11:28 PM IST

Pooja
విశాల్, శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘పూజై’. తెలుగులో ఈ సినిమాను ‘పూజ’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం ఒక పాట చిత్రీకరణ, రెండు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమె బాలన్స్ ఉంది. ఆ పాటను పోలాండ్ దేశంలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో శృతి హాసన్ తెలుగు, తమిళ భాషలలో ఒక పాట పాడడంతో పాటు స్వయంగా డబ్బింగ్ చెప్తుంది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, నటిస్తున్న ‘పూజై’లో రాజకీయ నాయకుడు, బిహార్ రాష్ట్ర మినిస్టర్ వినయ్ బిహారీ కీలక పాత్రలో కనిపిస్తుండడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు. విశాల్ ఈ సినిమాకు నిర్మాత.

తాజా వార్తలు