షూటింగ్ చివరిదశలో పూనం పాండే ‘మాలిని & కో’

షూటింగ్ చివరిదశలో పూనం పాండే ‘మాలిని & కో’

Published on Jan 27, 2015 4:47 PM IST

malini-and-co

శృంగార తార, ట్విట్టర్ క్వీన్ పూనం పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మాలిని & కో’. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని డాగ్‌ హౌస్‌లో ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నెలాఖరున 29, 30, 31వ తేదీలలో బ్యాంకాక్ లో మరో ఫైట్ తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు వీరు.కె తెలిపారు. జాకీచాన్‌ సినిమాలకు పనిచేసిన రోనీ మాస్టర్‌ బ్యాంకాక్ ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. బ్యాంకాక్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

జనవరి నెలాఖరున ఆడియోను, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇటివల జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత తెలిపారు. ‘యమలీల’, ‘వినోదం’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన మనీషా ఫిల్మ్స్ పతాకంపై కిషోర్ రాఠీ సమర్పణలో మహేష్ రాఠీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘యమలీల’ సినిమాలో బాల నటుడిగా నటించిన మిలన్ రాఠీ ‘మాలిని & కో’లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సామ్రాట్, కావ్య సింగ్, సాంబ, రవి కాలే ఇతర పాత్రదారులు. ఈ సినిమాలో మూడు పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చడం విశేషం.

తాజా వార్తలు