సోషల్ మీడియాలో అర్ధనగ్న (సెమి న్యూడ్) ఫోటోలు, సంచనల వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండడానికి ప్రయత్నించే పూనం పాండే హిందీలో నటించిన సినిమా ‘నషా’. మెట్రో ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత ఇవిఎన్ చారి తెలుగులో ‘తేరా నషా’ పేరుతో ఈ సినిమాను అనువదిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం ఫిల్మ్ ఛాంబర్లో ఆవిష్కరించారు.
అనంతరం నిర్మాత మాట్లాడుతూ.. ఆగస్ట్ 30న సినిమాను విడుదల చేస్తున్నాం. హిందీలో విజయం సాదించిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. బిజినెస్ బాగా జరిగింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పూనం పాండే నటన, గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. యూత్ ను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కని సందేశం ఈ సినిమాలో ఉంది అని తెలిపారు.


