ఆ మూడింటికే నా జీవితం అంకితం అంటున్న పాప్ సింగర్

ఆ మూడింటికే నా జీవితం అంకితం అంటున్న పాప్ సింగర్

Published on Sep 4, 2014 12:58 PM IST

smita
హాలీవుడ్లో ఎంతమంది పాప్ సింగర్స్ ఉన్నా తెలుగులో మాత్రం బాగా గుర్తింపు తెచ్చుకున్న పాప సింగర్ మాత్రం స్మిత అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. కానీ స్మిత కొంతకాలంగా సినిమాలకు మరియు పాప ఆల్బమ్స్ చేయకుండా తన బిజినెస్ లోనే బిజీగా ఉంది.

ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయాన్ని ఆమె ముందు ఉంచితే ‘డిసెంబర్ లో నేనొక ప్రోగ్రాం చేయనున్నాను. అది ఏంటనేది ఇప్పుడు చెప్పను. ప్రస్తుతం దానికోసమే అన్ని రకాలుగా రెడీ అవుతున్నాను. ఇది కాకుండా ప్రస్తుతం నేను వ్యాపారాలతో బిజీగా ఉన్నాను. అందుకే కాస్త పాప ఆల్బమ్స్ కి గ్యాప్ ఇచ్చాను. అతేకాకుండా నా ప్రతి వ్యాపారంలోనూ కొంత సేవ కార్యక్రమాలకే ఉపయోగిస్తాను. ప్రస్తుతం నా జీవితం మొత్తం ఆధ్యాత్మికం, దేశభక్తి, సేవ అనే మూడింటికి అంకితమైపోయిందని’ తెలిపింది.

మల్లీశ్వరి తర్వాత మళ్ళీ ఎందుకు సినిమాల్లో కనపడలేదని అడిగితే ‘నాకు తెలిసి నేను చేసిన పెద్ద తప్పు అదే. నాకెప్పుడు సినిమాల్లో నటించాలని లేదు. ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నాన అనేది నాకు ఇప్పటికీ తెలియడం లేదు. ఇకపై కమర్షియల్ సినిమాలు చేయను, ఆ సినిమా ద్వారా పదిమందికి ప్రయోజనం చేకూరుతుంది అనే గొప్ప సందేశాత్మక చిత్రం అయితే చేస్తానని’ చెప్పింది.

తాజా వార్తలు