మహేష్ సినిమాలో పాపులర్ నటుడు !

మహేష్ సినిమాలో పాపులర్ నటుడు !

Published on Jun 19, 2018 1:20 PM IST

మహేష్ బాబు యొక్క సిల్వర్ జూబ్లీ చిత్రం నిన్న డెహ్రాడూన్ లో మొదలైంది. ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.

అది కూడ మహేష్ బాబుకి తండ్రి పాత్రలో. అయితే ఈ విషయంపై ఇంకా కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ గతంలో మహేష్ యొక్క ‘భరత్ అనే నేను, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ గడ్డం పెంచి ఇంకాస్త యంగ్ లుక్ తో అలరించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు