అసిన్ కి పెళ్ళికొడుకు దొరికేసాడు.!

అసిన్ కి పెళ్ళికొడుకు దొరికేసాడు.!

Published on Aug 10, 2015 3:37 PM IST

asin1
మలయాళ కుట్టి అయిన అసిన్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అనతి కాలంలోనే వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకోవడమే కాకుండా సౌత్ లోని అందరి స్టార్ హీరోస్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలో అమీర్ ఖాన్ చేసిన ‘గజినీ’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సౌత్ సినిమాలను తగ్గించిన అసిన్ బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ వరుసగా ఆఫర్స్ దక్కించుకోవడమే కాకుండా నాలుగు 100 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

2012 లో వచ్చిన కిలాడి 786 తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అసిన్ త్వరలో అభిషేక్ బచ్చన్ తో నటించిన ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మలయాళ కుట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్దమైంది. అసిన్ గత రెండు సంవత్సరాలుగా మైక్రోమాక్స్ ఫౌండర్ అయిన రాహుల్ శర్మతో ప్రేమాయణం సాగిస్తోంది. తాజాగా అసిన్ రాహుల్ శర్మని పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. తాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘త్వరలో రాహుల్ శర్మని పెళ్లి చేసుకున్నాను. నా పర్సనల్ లైఫ్ లో ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయడం కోసం గత రెండేళ్ళ నుంచి కొత్త సినిమాలను ఒప్పుకోలేదు. ప్రస్తుతం నేను కమిట్ అయ్యున్న సినిమాలను ఫినిష్ చేస్తున్నానని’ అసిన్ తెలిపింది. స్వయంగా అసిన్ ఈ విషయాన్ని ఖరారు చేయడంతో త్వరలోనే అసిన్ పెళ్లి బాజాలు మోగుతాయని తన సన్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు