మహేష్ ‘ఆగడు’లో హైలైట్ కానున్న పోసాని కామెడీ

మహేష్ ‘ఆగడు’లో హైలైట్ కానున్న పోసాని కామెడీ

Published on Aug 27, 2014 5:01 PM IST

posani-murali-krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆగడు’. శ్రీను వైట్ల ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా తీస్తున్నా తన సినిమాలో కామెడీకి మాత్రం చాలా పెద్ద పీట వేస్తారు. గతంలో మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ సినిమాలో కూడా బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ కామెడీ సినిమాకి హైలైట్ అయ్యింది. శ్రీను వైట్ల తన తదుపరి సినిమా ‘ఆగడు’లో కూడా కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

మాకు అందిన తాజా సమాచారం ‘ఆగడు’లో కూడా కామెడీకి శ్రీను వైట్ల పెద్ద పీట వేసారు. ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర పోసాని కృష్ణమురళి ట్రాక్ ఉంటుంది. సుమారు 10 నిమిషాలు పాటు ఉండే ఈ ట్రాక్ ప్రేక్షకులని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు. పోసానితో పాటు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ లాంటి కమెడియన్స్ కూడా ఇందులో ఉన్నారు. మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించిన ఆడియో ఈ నెల 30న విడుదల కానుంది.

తాజా వార్తలు