మణిరత్నానికి మరోసారి మంచిరోజులోచ్చాయా?

మణిరత్నానికి మరోసారి మంచిరోజులోచ్చాయా?

Published on Apr 13, 2015 11:55 PM IST

Ok-Bangaram
మణిరత్నం తెరకెక్కించిన ‘ఒకే బంగారం’ సినిమా గతకొద్ది రోజులుగా హైప్ ని పెంచుకుంటూ విడుదలకు సిద్ధమవుతుంది. రెహమాన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమాని చుసిన సెన్సార్ సభ్యులు చిత్రాన్ని, తెరకెక్కించిన మణిరత్నం ప్రతిభను తెగపొగిడారట. దీంతో మణి తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే అని అభిమానులు ఖుషి అవుతున్నారు. ఈ సినిమా ఈ వారం చివర్లో విడుదలకానుంది. ఒకే బంగారం సినిమాలో దల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు.

ముంబాయి నేపధ్యంలో ఈ సినిమాను చిత్రీకరించారు. ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రధారి. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ని దిల్ రాజు svc ఫిలిమ్స్ ద్వారా విడుదలచేయనున్నారు.

తాజా వార్తలు