ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దొంగాట’!

ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దొంగాట’!

Published on Apr 29, 2015 9:32 PM IST

Dongata

తెలుగు సినీ పరిశ్రమలో కొత్తదనమున్న కథలకు ఎప్పుడూ మంచి ఆదరణే దక్కుతుంది. గతంలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన సినిమాలన్నీ ఆ కోవలో వచ్చినవే! తాజాగా ఆ కోవలోనే ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ‘దొంగాట’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా నటించి, నిర్మించిన సినిమాయే ‘దొంగాట’. అడవి శేష్ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారు.

ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మే మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు లక్ష్మి ఓ హీరోయిన్ పాత్రలో కనిపించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా మంచు లక్ష్మి పాడిన ‘యాందిరో..’ అనే పాటైతే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది.

సెన్సార్ బృందం తరపున కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా పట్ల అంతటా భారీ అంచనాలు ఉండడంతో సినిమా విడుదలకు సరైన సమయం కోసం సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. ఆ నేపథ్యంలోనే మే మొదటివారాన్ని విడుదలకు పర్ఫెక్ట్ టైమ్‌గా గ్రహించి అందుకు తగ్గట్టుగానే సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు