‘ఓకే బంగారం’ సాంగ్ ట్రాక్ కి సూపర్బ్ రెస్పాన్స్

‘ఓకే బంగారం’ సాంగ్ ట్రాక్ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Mar 15, 2015 7:49 PM IST

ok-bangaram

సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయాలను అందుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ సారి మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అందుకోవడానికి ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చెయ్యడమే కాకుండా, సినిమాపై రోజు రోజుకీ క్రేజ్ ని పెంచేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ ఓ ఇచ్చిన పాటకి అందరూ మంత్ర ముగ్దులయ్యారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం ఈ సినిమాలోని ‘మెంటల్ మదిలో’ అనే పాట టీజర్ ని రిలీజ్ చేసారు.

ఈ పాటలో ముంబై బ్యాక్ డ్రాప్ లోని ఒక యువ జంట యొక్క లైఫ్ స్టైల్ మరియు వారి రొమాంటిక్ మొమెంట్స్ ని చూపించారు. ఈ రోజు విడుదలైన ‘మెంటల్ మదిలో’ కూడా అందరికీ నచ్చేసింది. ఈ ఫుల్ సాంగ్ ని మార్చి 17న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్ర టీం ఈ సినిమాలోని పాటలన్నిటినీ ఇదే విధంగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఏప్రిల్ 14న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు