ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో గా, దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో రామ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా బాగా ఆకట్టుకున్నాడు. దాంతో ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రైలర్ 3 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసుకొని వస్తోన్న ఈ చిత్రం.. ట్రైలర్ లో కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలనే ఎక్కువుగా చూపించారు. రామ్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఎంటర్టైనర్ ను దసరా కానుకగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


