బి,సి సెంటర్స్ లో కలెక్షన్ కురిపిస్తున్న ‘పవర్’

power-latest
మాస్ మహారాజ రవితేజ హీరోనా నటంచిన మాస్ ఎంటర్టైనర్ ‘పవర్’ గత శుక్రవారం విడుదలై మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. విడుదలైన రోజు నుంచి బి, సి సెంటర్స్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మూడవ రోజు కూడా పవర్ బి, సి సెంటర్స్ లో కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ప్రస్తుతం పవర్ సినిమా కలెక్షన్స్ రవితేజ కెరీర్లోనే రికార్డ్ సృష్టించే దిశగా దూసుకుపోతున్నాయి.

ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ ని ఒకటి లేదా రెండు వారాల్లో బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక, రెజీన హీరోయిన్స్ గా నటించారు. వచ్చే వారం రిలీజ్ కానున్న ‘ఆగడు’ సినిమా వల్ల కాస్త ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version