పవన్ హెల్త్ అప్డేట్.. ఇంకొన్ని రోజులు తప్పదు

Published on Apr 20, 2021 8:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఐసొలేషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల చేసిన పరీక్షల ఫలితాలు 18వ తేదీన రాగా ఆయనకు పాజిటివ్ అని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఇంట్లోనే ఉంటూ ఆయన చికిత్స తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తిగత వైద్యుడి సహా అపోలో వైద్యుల ప్రత్యేక బృందం ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రామ్ చరణ్ తన బాబాయికి కావాల్సిన అన్ని రకాల వైద్యపరమైన ఏర్పాట్లను చూసుకుంటున్నారు. పవన్ సైతం తాను బాగానే ఉన్నానని అభిమానులకు ధైర్యం చెప్పారు.

రెండు మూడు రోజుల చికిత్సతోనే పవన్ చాలావరకు కోలుకున్నారని తెలుస్తోంది. ఆయన మీద వైరస్ ప్రభావం దాదాపు తగ్గినట్టేనని, ఇంకో ఐదారు రోజుల్లో పూర్తిగా వైరస్ ప్రభావం నుండి బయటపడతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పవన్ బయటకు రావడానికి మాత్రం ఇంకో రెండు మూడు వారాలైనా పట్టవచ్చని తెలుస్తోంది. అంటే మే మొదటి వారంలో లేదా రెండో వారంలో సెట్స్ మీద ఉన్న ఆయన రెండు సినిమాలు రీస్టార్ట్ కావొచ్చు.

సంబంధిత సమాచారం :