“వకీల్ సాబ్”లో పవర్ స్టార్ టైటిల్ కార్డ్ ఇప్పుడు వైరల్.!

Published on Apr 30, 2021 5:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” డిజిటల్ ప్రీమియర్ గా ఈరోజు అర్ధ రాత్రి నుంచే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇక మళ్ళీ అంతా ఒక రౌండ్ షో వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ అవుతుంది.

అప్పుడు సినిమా విడుదల అప్పుడు ఎవరూ నోటీస్ చెయ్యనిది ఇప్పుడు పవన్ అభిమానులు నోటిస్ చేశారు. మాములుగా మన స్టార్ హీరోల సినిమాలు అంటే వారి పేరు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పడాల్సిందే. మరి అలా వకీల్ సాబ్ కు కూడా మేకర్స్ బాగానే డిజైన్ చేశారు. కానీ వకీల్ సాబ్ కు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు సృష్టిలోని 5 పంచభూతాలతో కలిపి స్టార్ లా వచ్చి అప్పుడు వస్తుంది.

అదేదో అవెంజర్స్ ఇన్ఫినిటీ స్టోన్స్ లా ఒక్కొక్కటి వచ్చి అలా ఫార్మేషన్ అవుతుంది. దీనితో ఇప్పుడు ఇది నోటిస్ చేసిన పవన్ అభిమానులు ఈ ఊహించని క్రెడిట్ మొత్తం దర్శకుడు వేణు శ్రీరామ్ కె దక్కుతుంది అని మళ్ళీ అతనికి స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నారు. అయితే ఈ అద్భుతమైన గ్రాఫికల్ డిజైన్ ను ఈ సినిమాకు పని చేసిన వర్క్ ఫ్లో గ్రాఫిక్స్ హెడ్ ప్రదీప్ పూడి డిజైన్ చేశారట. తాను చేసిన ఈ డిజైన్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :