పవన్ ‘వకీల్ సాబ్’ వెనక్కి వెళ్లక తప్పదా ?

Published on Apr 3, 2020 12:00 am IST

పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను మే 15న విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ జులై నెలకు పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఒకవేళ ఈ సినిమా గాని జులై కి పోస్ట్ ఫోన్ అయితే మాత్రం, ఎప్పుడెప్పుడూ సినిమా చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడతారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె రోల్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తోందని సమాచారం.

ఇక ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ లుక్ అండ్ సాంగ్ కు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ గడ్డంతో వెలికిలా పడుకుని చేతిలో బుక్ తో వెరీ స్టైలీష్ లుక్ లో కనిపించారు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More