ప్రభాస్ సినిమాకు తగ్గేదే లేదంటున్నారా?

Published on Sep 25, 2020 12:18 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ స్ట్రయిట్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు జస్ట్ అనౌన్స్మెంట్స్ తోనే భారీ హైప్ ను తెచుకున్న ఈ చిత్ర యూనిట్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

అయితే ఈ చిత్రం రామాయణ ఇతిహాస గాథపై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంటే భారీ విజువల్స్ తో కూడుకున్న చిత్రం ఇది. కేవలం ఈ చిత్రానికి భారీ ఖర్చు చేయడానికి నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు రెడీ అయ్యారు. అయితే గత కొన్ని రోజుల కితం ఈ విషయంలో మాత్రం అవుట్ ఫుట్ కోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారని టాక్ వినిపించింది.

కానీ ఇప్పటికీ కూడా నిర్మాతలు ఈ విషయంలో వెనకడుగు వెయ్యాలనుకోవడం లేదట. ఈ చిత్రంలో రావణునిగా సైఫ్ నటిస్తుండగా ఇతర కీలక పాత్రలు అయినటువంటి సీత మరియు లక్ష్మణుల రోల్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ భారీ చిత్రాన్ని 3డిలో తెరకెక్కించిన 2022లో విడుదలకు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More