“రాధే శ్యామ్” షురూ చేసేసిన ప్రభాస్.!

Published on Jun 25, 2021 2:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. అద్భుతమైన ప్రేమ కావ్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆల్రెడీ షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయినా మళ్ళీ కొంత పార్ట్ రీ షూట్ చెయ్యాలని భావించి మేకర్స్ కొన్ని రోజులు ప్లాన్ చేశారు. కానీ అనూహ్యంగా కరోనా రెండో వేవ్ మూలాన ఆ షూట్ వాయిదా పడింది.

మరి ఇప్పుడు మళ్ళీ కరోనా తగ్గుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం షూట్ కి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. ఈ జూన్ చివరి వారం నుంచి స్టార్ట్ చెయ్యనున్నారని టాక్ రాగా ఇప్పుడు అది నిజం అయ్యింది. ఈరోజు నుంచే ప్రభాస్ రాధే శ్యామ్ బ్యాలన్స్ షూట్ ను షురూ చేసేసినట్టు తెలుస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ షూట్ కంప్లీట్ అయ్యిపోనుంది. దీని తర్వాత మళ్ళీ “సలార్” షూట్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం :