పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ మూవీకి ప్రభాస్ బెస్ట్ విషెస్

పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ మూవీకి ప్రభాస్ బెస్ట్ విషెస్

Published on Mar 27, 2024 10:50 PM IST

మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). దీనిని బ్లెస్సి తెరకెక్కించగా అమలాపాల్ హీరోయిన్ గా నటించారు.

ఇక ఈ మూవీ రేపు రిలీజ్ అవుతుండడంతో టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ మూవీ టీమ్ కి అలానే ప్రత్యేకంగా పృథ్వీరాజ్ సుకుమారన్ కి బెస్ట్ విషెస్ తెలియచేసారు. మీరు ఈ విధంగానే మంచి నటుడిగా మరింతగా ప్రకాశిస్తూ ఉండండి పృథ్వీరాజ్, నేను మీ అంకితభావాన్ని ప్రత్యక్షంగా చూశాను మరియు ఈ చిత్రం కోసం మీరు ఎంత కష్టపడి పనిచేశారో నాకు తెలుసు.

ది గోట్ లైఫ్ మీకు మరొక విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు