ఆ సినిమాకు మొదటి టికెట్ కొన్నది ప్రభాసే

Published on Jul 11, 2019 5:22 pm IST

యంగ్ హీరో సందీప్ కిషన్ స్వయంగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను కార్తీక్ రాజు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం రేపు 12వ తేదీన విడుదలకానుంది. ఇప్పటికే విన్నూత్నమైన రీతిలో ప్రమోషన్లు చేసిన టీమ్ ఇంకో అడుగు ముందుకేసి మొదటి టికెట్ ను రెబల్ స్టార్ ప్రభాస్‌కు విక్రయించి ఇంకాస్త బజ్ సంపాదించుకున్నారు.

ఈమధ్య పెద్దగా విజయాలు లేకపోవడంతో సందీప్ కిషన్ ఈ చిత్రంపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ నెలకొనడంతో సందీప్ విజయంతో ధీమాగా ఉన్నారు. అన్యా సింగ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో మాళవిక మోహన్, దర్శకులు విని ఆనంద్, కార్తీక్ నరేన్ అతిధి పాత్రలు చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More