‘సాహో’తోనైనా అమ్మడు దశ మారేనా…?

Published on Jun 3, 2019 7:52 pm IST

‘సాహో’ లో ఎవ్లీన్ శర్మ ఐటెం సాంగ్ లో ప్రభాస్ తో ఆడిపాడనుండి. ఇండో జర్మన్ ఫ్యామిలీ చెందిన ఈ భామ త్వరలో పంకజ్ త్రిపాఠి హీరోగా వస్తున్న “కిస్సే బాజ్” మూవీ లో నటిస్తుంది. ఇంతకు ముందు ఈ అమ్మడు ‘యే జవానీ హై దివాని’, ‘మైన్ తేరా హీరో’ అనే చిత్రాలలో నటించినా అంతగా గుర్తింపు వచ్చింది లేదు.

‘సాహో’ లో చేస్తున్న ఐటెం సాంగ్ తో పాటు,ఓ రివేంజ్ డ్రామా జోనర్ లో వస్తున్న మూవీలో బబ్లీ అనే ఓ ముఖ్య పాత్ర చేస్తుందంట. అనంత్ జైట్పాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే నెలలో విడుదలకు సిద్దమైందట. సాహో లో ప్రభాస్ తో కలిసి ఎవ్లీన్ శర్మ దుబాయ్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రికరణలో పాల్గొందంట. మరి ‘సాహో’ అయినా ఎవ్లీన్ శర్మ దశ మారుస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More