తనకి తాను లాక్డౌన్ విధించుకున్న ప్రభాస్ దర్శకుడు.!

Published on Apr 29, 2021 1:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఎన్నో భారీ సినిమాలు చేస్తున్నా తన అభిమానుల దృష్టిలో మాత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ వరల్డ్ చిత్రంపై మాత్రం మరో స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. అయితే తరచుగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకునే ఈ దర్శకుడు తాజాగా తనకి తాను లాక్ డౌన్ పెట్టుకుంటున్నాని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

అయితే అసలు విషయంలోకి వెళ్తే “ప్రభుత్వం లాక్ డౌన్ పెడుతుందో లేదో కానీ నాకు నేను అయితే వచ్చే రెండు వారాలు లాక్ డౌన్ పెట్టుకుంటున్నానని, లాక్ డౌన్ అనవసరం సమాధానం కాదు అంటారా? ఒకసారి బయట పరిస్థితులు, గత నెల నుంచి ఆసుపత్రులు చూడండి ఎంతమంది ఎంతలా కష్టపడుతున్నారో..ఇకనైనా మనం సాధ్యమైనంత త్వరగా వాక్సిన్ వేయించుకొని డాక్టర్స్ కి కాస్త విశ్రాంతి ఇద్దాం” అని నాగ్ అశ్విన్ తన మనసులో మాట బయట పెట్టారు.

సంబంధిత సమాచారం :