మరో భారీ సాయం ప్రకటించిన ప్రభాస్..!

Published on Mar 30, 2020 1:35 pm IST

డార్లింగ్ ప్రభాస్ మరో మారు భారీ విరాళం ప్రకటించి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆయన కరోనా క్రైసిస్ చారిటీ కొరకు మరో 50లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది కార్మికులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తరుణంలో హీరోలు మరియు ప్రముఖులు వారి సహాయార్థం విరాళాలు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ఇంత భారీ మొత్తం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టే కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా 4కోట్ల రూపాయలు ప్రభాస్ విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు.ఈ చిత్రం ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకోగా కరోనా లాక్ డౌన్ కారణంగా నెక్స్ట్ షెడ్యూల్ వాయిదా వేశారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More