ప్రభాస్ కి మోహన్ బాబు భారీ షాక్

Published on Feb 22, 2020 11:38 am IST

మంచు విష్ణు భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి ప్రభాస్ కి షాక్ ఇచ్చాడు. దాదాపు 60కోట్ల బడ్జెట్ తో భక్త కన్నప్ప చిత్రం మంచు విష్ణు హీరోగా రానున్నట్లు నిన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే భక్త కన్నప్ప రెబెల్ స్టార్ ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు 1976లో ఈ చిత్రంలో నటించారు. అప్పట్లో భక్త కన్నప్ప భారీ విజయం సొంతం చేసుకుంది.

హీరో కృష్ణం రాజు కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా ఉన్న భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో తెరకెక్కించాలని కృష్ణం రాజు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. అలాగే పెదనాన్న కోరిక కావడంతో ప్రభాస్ కూడా భక్త కన్నప్ప చిత్రాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు. ఐతే సడన్ గా మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ ప్రకటించడంతో ప్రభాస్ కి షాక్ ఇచ్చినట్లయింది.

సంబంధిత సమాచారం :