ఎదురుచూపుల్లో రెబల్ స్టార్ అభిమానులు

Published on Jan 17, 2020 11:48 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసమే ఈరోజు ఒక క్రేజీ అప్డేట్ ఇస్తామని టీమ్ అన్నారు. కానీ అప్డేట్ బయటికొచ్చే టైమ్ మాత్రం చెప్పలేదు.

దీంతో అసలే సుధీర్ఘమైన ఎదురుచూపూలతో విసిగిపోయిన అభిమానులు ఈరోజు కూడా ఎంతసేపు ఎదురుచూడాలి, అసలు టైమ్ చెబితే పోయేది కదా అంటున్నారు. మరోవైపు ఈరోజు నుండి షూటింగ్ మొదలవుతుంది అని చెప్పడానికే ఈ అప్డేట్ అంటున్నారు కొందరు. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :