“సాహో” విషయంలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్.!

Published on Jun 4, 2019 4:58 pm IST

ఇప్పుడు డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియా పై దాడి చేస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “సాహో” చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ మధ్య అంతా ఒకటి రెండు అప్డేట్స్ ను చెప్పి చెప్పకుండా ఇచ్చినా సరే డార్లింగ్ అభిమానులు మాత్రం అది సరిపోలేదట ఇంకా చెప్పాలి అంటే మేకర్స్ పై ఇంకా నమ్మకం కుదరలేదు.మళ్ళీ అప్డేట్ ఇవ్వండి అంటూ యూవీ క్రియేషన్స్ వారిని ట్యాగ్ చేసి మరీ అడుగుతున్నారు.

ఇదొక్కటి మాత్రమే కాకుండా “వీ వాంట్ సాహో అప్డేట్” అంటూ ట్విట్టర్ లో ఒక ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేసి ఇంకా కొనసాగిస్తున్నారు.ఇంకా సినిమా విడుదలకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉంది కానీ వీరు మాత్రం సినిమా కోసం ఎలాంటి సమాచారాన్ని మాకు తెలియజేయడం లేదని మరికొంత మంది వాపోతున్నారు.మరి వీరి కోరిక మేరకు సుజీత్ కానీ మేకర్స్ కానీ ఏదన్నా అధికారక ప్రకటన ఇస్తారో లేదో చూడాలి.శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More