దుల్కర్ సల్మాన్ “హే సినామిక” కోసం ప్రభాస్

Published on Jan 27, 2022 1:21 pm IST


ప్రఖ్యాత మహిళా కొరియోగ్రాఫర్ బృందా, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ, తెలుగు చిత్రం హే సినామికతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈరోజు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాలోని ప్రాణం పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేయబోతున్నారు. అంతేకాకుండా, మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, రష్మిక మందన్న మరియు కుంచాకో బోబన్ తమిళ పాట తోజిని ఒకేసారి లాంచ్ చేయబోతున్నారు. గోవింద్ వసంత ఈ మెలోడియస్ ట్రాక్‌ని కంపోజ్ చేశారు. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :