ప్రభాస్ ఒక్క ఏడాదిలో అక్షరాలా 150 కోట్లు వదులుకున్నాడట.!?

Published on Jun 23, 2021 1:00 pm IST

ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమా దగ్గరే ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ గా మారింది. అలాగే తాను ఓ సినిమా ఒప్పుకుంటే మినిమమ్ దాని ఫస్ట్ డే వసూళ్ల లెక్కే 100 కోట్ల మార్క్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక పర్ఫెక్ట్ హిట్ టాక్ వస్తే అది ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పలేం అది వేరే విషయం. అలాంటి స్టార్డం తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలకు కూడా 100 కోట్లకు పైగానే ఛార్జ్ చేస్తున్నట్టు తెలిసింది.

మరి అలాంటి ప్రభాస్ ఒక్క ఏడాదిలో 150 కోట్లు వదిలేసుకున్నాడని తెలుస్తుంది. అయితే అసలు వివరాల్లోకి వెళితే అది సినిమాల పరంగా కాదట తన దగ్గరకి వచ్చిన యాడ్ ఏజెన్సీల నుంచి అని తెలుస్తుంది. అది కూడా గత ఒక్క ఏడాదిలోనే అని టాక్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఒకే ఒక్క యాడ్ లో నటించినట్టు ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెద్దగా యాడ్స్ లో కనిపించలేదు.

మరి తనకి వస్తున్న అపారమైన ఆదరణతోనే పెద్ద ఎత్తున అనేక రకాల యాడ్స్ ప్రభాస్ చెంతకు భారీ ఆఫర్స్ తో వచ్చాయట. అలాగే వాటిలో ఒకటో 18 కోట్ల భారీ ఆఫర్ కూడా ఉందట. మరి ఇంతలా ఆఫర్స్ వచ్చినా ప్రభాస్ వదులుకున్నాడో దానికి కారణం ఏమిటో కూడా ఉంది.

ఇప్పుడు తనకున్న ఇమేజ్ నిమిత్తం తన నుంచి ఏదైనా ఆఫర్ ను సరిగ్గా వినియోగించుకోవాలని వాటి మూలాన ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఇతరులు ఎదుర్కోకూడదని అలాంటి ఎన్నో బ్రాండ్స్ ఆఫర్స్ ను వదులుకొని దాదాపు అన్నటికి దూరంగానే ఉండాలని ఫిక్స్ అయ్యాడట. ఇలా డార్లింగ్ హీరో ఇన్ని కోట్లు వదులుకొని తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

సంబంధిత సమాచారం :