మరో భారీ పోరాట సన్నివేశానికి సన్నద్ధం అవుతున్న ప్రభాస్.?

Published on Sep 18, 2021 7:02 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస కావ్యం “ఆదిపురుష్” ఒకటి కాగా మరొకటి సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన చిత్రం “సలార్” కూడా ఒకటి. రెండూ రెండు కూడా కంప్లీట్ డిఫరెంట్ చిత్రాలుమ్ రెండిటి కూడా ప్రభాస్ భిన్నమైన లుక్స్ లోనే సినిమా చెయ్యాల్సి ఉంటుంది. మరి ఇదిలా ఉండగా ఇటీవల ప్రభాస్ సలార్ కి భారీ యాక్షన్ బ్లాక్ లో పాల్గొని దాన్ని ముగించినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఇక దీని తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ లో ఓ భారీ పోరాట సన్నివేశం కోసం సన్నద్ధం అవుతున్నాడట. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా అంటే భీకర యుద్ధ సన్నివేశాలు కూడా గ్యారెంటీ మరి అలాంటి ఓ భారీ సన్నివేశం కోసం ప్రభాస్ ఇప్పుడు సన్నద్ధం అవుతున్నాడాని తెలుస్తోంది. మరి ఇది వరకే లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ కూడా ప్రభాస్ తీసుకున్నాడు. మరి ఈ సినిమాలో రామునిగా ఎలా ఆశ్చర్య పరుస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :