ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ తెచ్చుకొని ఆ తరహా పాత్రలు చేస్తూ వెళుతున్నారు. అయితే ఈ సినిమాల కంటే ముందు ఉండే ప్రభాస్ వేరే లెవెల్.. ఆ లైనప్ లో దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేసిన సినిమాలకి ఉండే ఫ్యాన్స్ కూడా వేరే. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలలో ప్రభాస్ కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తాడు.
మరి పూరి టేకింగ్ పై ప్రభాస్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. బుజ్జిగాడు సినిమానే అనుకుంటే ఏక్ నిరంజన్ లో తన రోల్ ఇంకా డిఫరెంట్ గా అనిపించేది అని దానిని ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాణ్ణి అని, అంతే కాకుండా ఆ సినిమాలో డైలాగ్స్ పూరీ గారి రైటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని తెలిపాడు.
తన లాంటి రైటింగ్ మన తెలుగులోనే కాదు ఇండియా లోనే కాదు వరల్డ్ లోనే ఎవరు చెయ్యలేరు, ఎవరి వల్ల కాదని కపుల్ ఫ్రెండ్లి టీం తో జరిపిన చిట్ చాట్ లో ప్రభాస్ కితాబిచ్చాడు. దీనితో ఈ కామెంట్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఎంతోమందితో వర్క్ చేసి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ ని చూసిన ప్రభాస్ లాంటి హీరోనే పూరి లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్తున్నాడు. మరి అలాంటి పూరి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తన నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘స్లమ్ డాగ్’ అయినా మళ్ళీ వింటేజ్ పూరిని చూపిస్తుందో లేదో చూడాలి.


