యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా ప్రభాస్

Bahubali
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అనుష్క, తమన్నా నటినటులుగా రూపొందుతున్న చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ప్రభాస్ మరియు ఇతర తారాగణంపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 2015 ప్రధమార్ధంలో మొదటి భాగం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 180 కోట్ల భారి బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు.

Exit mobile version