హాలీవుడ్‌లోకి రెబల్ స్టార్ ప్రబాస్?

Published on Sep 1, 2021 3:00 am IST

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాలను చేస్తున్నాడు. అయితే ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ హాలీవుడ్ లో సైతం అభిమానుల ప్రేమని సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాల తర్వాత ప్రభాస్‌ను హాలీవుడ్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక నిర్మాణ సంస్థ ప్రభాస్‌తో ఒక హై బడ్జెట్ సినిమాని ప్లాన్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక హారర్ స్టోరీ అని సమాచారం. నిజానికి ప్రభాస్‌కు హారర్ సినిమాలు నచ్చవు. మరీ ఈ కథకు ప్రభాస్ ఒకే చెబుతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :