నార్త్ టీజర్స్ లో ఒక స్టాండర్డ్ సెట్ చేసి పెట్టేసిన ప్రభాస్.!

నార్త్ టీజర్స్ లో ఒక స్టాండర్డ్ సెట్ చేసి పెట్టేసిన ప్రభాస్.!

Published on Nov 2, 2022 4:23 PM IST

పాన్ ఇండియా మార్కెట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు ఎప్పుడు నుంచో ఒక సంచలనం. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత రెండు సినిమాలు పెద్దగా రాణించలేదు పైగా నెక్స్ట్ ఆదిపురుష్ కూడా టీజర్ తో మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది అయినా కూడా నెక్స్ట్ సినిమాలపై నెక్స్ట్ లెవెల్ హైప్ ముఖ్యంగా హిందీ మార్కెట్ లో ప్రభాస్ కి కనిపించడం అనేది విశేషం.

ఉదాహరణకి తన రెండు చిత్రాలు “ఆదిపురుష్”, “సాహో” సినిమాల ప్రస్తావనే ఇప్పుడు నడుస్తుంది. బాలీవుడ్ లో అక్కడి స్టార్స్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ ఈ రెండు సినిమాల మ్యాజిక్ ని ఆ రేంజ్ లో అందుకోలేకపోయాయి అని క్లియర్ గా కనిపిస్తుంది. ఈరోజు షారుఖ్ “పఠాన్” నుంచి క్రేజీ టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ఇది ఓ భారీ యాక్షన్ ఫిల్డ్ చిత్రంగా దీనిలో కనిపిస్తుంది.

కానీ ఇండియన్ సినిమా దగ్గర బెస్ట్ యాక్షన్ టీజర్ కట్ ఏదన్నా ఉంది అంటే అక్కడ “సాహో” టీజర్ టాపిక్ డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే సాహో టీజర్ కట్ కోసం మళ్ళీ హాట్ టాపిక్ అవుతుంది. ఆ రేంజ్ లో సాహో మేకర్స్ సెట్ చేశారు.

ఇక రెస్పాన్స్ పరంగా అయితే ఆదిపురుష్ కి హింది టీజర్ లో చాలానే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ వ్యూస్ సహా లైక్స్ పరంగా ఆదిపురుష్ రికార్డులు కూడా పదిలంగానే ఉన్నాయి. దీనితో అయితే హిందీ మార్కెట్ లో మాత్రం ప్రభాస్ సినిమాల స్టాండర్డ్ తాను ఎలా సెట్ చేసాడో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే “సలార్” తో ఆ హీట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు