ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం ఆరోజే !

Published on Sep 3, 2018 7:43 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం’ రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. భారీ బడ్జెట్తో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం తరువాత ప్రభాస్ ‘జిల్’ ఫెమ్ రాధాకృష్ణ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ప్రేమకథ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఈసినిమా షూటింగ్ ఎక్కువ భాగం యూరప్లో జరుగనుంది.

సంబంధిత సమాచారం :