ప్రభాస్ కొత్త సినిమా లాంచ్ ఎప్పుడంటే..!

ప్రభాస్ కొత్త సినిమా లాంచ్ ఎప్పుడంటే..!

Published on Apr 9, 2015 11:40 AM IST

prabhasa
‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోయే కొత్త సినిమా త్వరలోనే మొదలవనుంది. ‘మిర్చి’ సినిమా తర్వాత తన రెండేళ్ళ సమయాన్ని ప్రతిష్టాత్మక ‘బాహుబలి’ చిత్రానికే కేటాయించిన ప్రభాస్, మళ్ళీ ఇప్పటికి మరో కొత్త సినిమాలో నటించేందుకు సిద్దమయ్యాడు. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’ లాంటి మూడు హిట్ సినిమాలను అందించిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్, ప్రభాస్ కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ సినిమా లాంచ్‌కి సంబంధించిన సమాచారం అందింది. మే నెలలో ఈ యాక్షన్ రొమాన్స్ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. సుజీత్ చెప్పిన కథకు థ్రిల్లైన ప్రభాస్ చిన్న చిన్న మార్పులతో వెంటనే సినిమాను ఓకే చేసేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

తాజా వార్తలు