ప్రభాస్ ఈ సారి ప్రేమ కథతో రానున్నాడు !
Published on Jul 23, 2018 11:36 am IST

బాహుబలి చిత్రం తో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం’ రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రం తరువాత ‘జిల్’ డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ప్రేమకథ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈచిత్రం ఆగష్టు మొదటి వారం లో గ్రాండ్ గా లాంచ్ కానుంది. యూరప్ లో షూటింగ్ జరుపోకోనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఇక ‘జిల్ ‘చిత్రంలో గోపీచంద్ ను స్టయిలిష్ గా చూపించిన దర్శకుడు రాధాకృష్ణ తన తరువాతి చిత్రంలో ప్రభాస్ ను ఎలా చూపెడతాడో చూడాలి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook