ప్రభాస్ పాన్ వరల్డ్ ఫిలిం ఇంకాస్త వెనక్కి

Published on Apr 27, 2021 12:00 am IST

ప్రభాస్ ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి ‘సలార్’ కాగా మరొకటి ‘ఆదిపురుష్’. రెండూ షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రభాస్ రెండు సినిమాలను సమాంతరంగా చేసుకుంటూ వెళ్తుండగా ఇంతలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ప్రభాస్ షెడ్యూల్ కొలాప్స్ అయింది. కేసుల ఉధృతి తగ్గేవరకు ప్రభాస్ ఏ సినిమానూ రీస్టార్ట్ చేయలేరు. దీంతో రెండు సినిమాలు పూర్తికావడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.

ఈ ప్రభావం నాగ్ అశ్విన్ సినిమా మీద పడబోతోంది. నాగ్ అశ్విన్ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద సినిమా. ఇండియా నుండి రాబోతున్న మొదటి పాన్ వరల్డ్ సినిమా. కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ భాషలోనూ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే చిత్రం జూలై నుండి మొదలుకావాల్సి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు సరిగా లేవు కాబట్టి అక్టోబర్ నెలకు వాయిదా వేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ఈలోపు నాగ్ అశ్విన్ కూడ భారీగా ఉన్న ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి షూటింగ్ సమయానికి పెద్దగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :