ఈ మూడింటికి ఇలా ప్లాన్ చేసుకున్న ప్రభాస్.!

Published on Jun 14, 2021 10:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలు కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. మరి వీటిలో దర్శకుడు రాధా కృష్ణతో ప్లాన్ చేసిన “రాధే శ్యామ్” ఆల్రెడీ కంప్లీట్ అయినా మళ్ళీ రీషూట్స్ పడడంతో దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ చిత్రం కాకుండా ప్రశాంత్ నీల్ తో భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” అలాగే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

మరి ఈ మూడు చిత్రాలకు సంబంధించి ప్రభాస్ దశల వారీగా టైం సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొదటగా రాధే శ్యామ్ షూట్ లో ఈ జూన్ నెలాఖరున పాల్గొని ఫినిష్ చేసేయనుండగా “సలార్” షూట్ లో వచ్చే జూలై మధ్య నుంచి జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక దీని తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఆదిపురుష్ షూట్ కి డేట్స్ ఇచ్చినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మొత్తానికి ఇలా మూడు సినిమాలకు రాబోయే మూడు నాలుగు నెలలు ప్రభాస్ బిజీ బిజీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :