వైరల్ అవుతోన్న ‘ప్రభాస్’ పోస్ట్ !

Published on Apr 29, 2019 4:55 pm IST

బాహుబ‌లి సిరీస్ తో నేషనల్ స్టార్ అయిపోయాడు రెబల్ స్టార్. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సుజిత్ దర్శకుడిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’ ఆగష్టు 15న విడుదల కానుంది. అయితే ప్రభాస్ బాహుబలి సినిమా గురించి సోషల్ మీడియాలో నిన్న చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

ప్ర‌భాస్ నిన్న సాయంత్రం తన ఫేస్‌బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. ‘రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌ విడుద‌లైంది. ఆ రోజును నా జీవితంలో నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. రాజ‌మౌళికి, బాహుబలి మొత్తం చిత్రబృందానికి నేనెప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. ఇక ఎప్పుడూ నా వెన్నంటే ఉంటున్న ప్రియమైన అభిమానులంద‌రికీ ప్రత్యేకమైన కృత‌జ్ఞ‌త‌లు. మీ ప్రోత్సాహం నాకు అందిస్తూ.. నాకు పెద్ద విజ‌యం అందించినందుకు ధన్య‌వాదాలు’ అని ప్ర‌భాస్ పోస్ట్ చేశారు. కాగా ఈ పోస్ట్ ను ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తులో షేర్ అండ్ లైక్స్ తో పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :