తెలుగు సినిమా గతిని మార్చిన “బాహుబలి”పై ప్రభాస్ పోస్ట్.!

Published on Jul 10, 2021 12:00 pm IST

ఇప్పుడు మన తెలుగు సినిమా స్పాన్ పెరిగి ఆల్ మోస్ట్ అందరి స్టార్ హీరోల సినిమాలు కూడా పాన్ ఇండియన్ స్థాయి మేకింగ్ తెచ్చుకొని రిలీజ్ లు అవుతున్నాయి అంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటిల కలయికలో వచ్చిన “బాహుబలి” సినిమా చెప్పాలి. రాజమౌళి మరియు అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆలోచనలలో సాధారణంగానే మొదలైనా ఈ హిస్టారికల్ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే హిట్ గా నిలిచింది.

ప్రభాస్ మరియు రాజమౌళిల ఐదేళ్ల అపారమైన డెడికేషన్ కి ఈరోజుతో ఆరేళ్ళు పూర్తయ్యింది. దీనితో ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండగా ప్రభాస్ కూడా ఒక ఆసక్తికర పోస్ట్ ని పెట్టాడు. “ఆరేళ్ళు పూర్తి చేసుకున్న బాహుబలి సినిమా యూనిట్ తమ సినిమాటిక్ మ్యాజిక్ తో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా కెరటాలు ఎగసేలా చేసారని” తెలిపాడు.

మరి మొదటి భాగంతో దేశ వ్యాప్తంగా హిట్ కొట్టారో రెండో భాగంతో ఎలాంటి ఘన విజయాన్ని నమోదు చేసారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇలాంటి సృజనాత్మక సినిమాతో తెలుగు సినిమా గతిని మార్చవేసిన రాజమౌళి ఈసారి తెలుగు నేలకే చేసిన నిజ జీవిత స్వాతంత్య్ర యోధులపైనే సినిమా తీస్తున్నారు. మరి అది ఎలాంటి విజయాన్ని చరిత్రలో నమోదు చేస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :