మహాభారతం చేస్తే ప్రభాస్ ఆ పాత్ర చేస్తారట…!

Published on Aug 24, 2019 7:29 am IST

సాహో సందడి ఇంకా కేవలం వారం రోజుల వ్యవధిలో మొదలుకానుంది. ప్రభాస్ నుండి రెండేళ్ల తరువాత వస్తున్న చిత్రం కావడంతో పాటు, భారీ తనంతో తెరకెక్కిన చిత్రం కావడంతో అటు ప్రభాస్ అభిమానులు, ఇటు సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా నిన్న ప్రభాస్ బెంగుళూరులో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగే పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు పంచుకున్నారు. ఐతే ఒక విలేకరి మహాభారతం చేయాల్సి వస్తే అందులో ఏ పాత్ర చేయడానికి ఇష్టపడతారు అని అడుగగా, ప్రభాస్ అందులో ఎటువంటి పాత్రైనా చేయడానికి ఇష్టపడతానన్న ఆయన, ముఖ్యంగా అర్జునుడు పాత్ర చేస్తాను అంటూ మనసులో మాట బయటపెట్టారు.

ఇక ఆయన తరువాత చేయబోయే చిత్రం ఓ లవ్ స్టోరీ అని, ఆ చిత్రానికి సంబందించి ఓ 20రోజుల చిత్రీకరణ కూడా జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభాస్ ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు టార్గెట్ గా పెట్టుకున్నారట.

సంబంధిత సమాచారం :